AP News:‘ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయండి’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

విద్యుత్ ఛార్జీల పెంపు(Electricity Charges Increase)పై మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఇచ్చిన పిలుపుమేరకు ఉదయం నుంచే జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు.

Update: 2024-12-27 13:46 GMT
AP News:‘ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయండి’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు(YCP Leaders) నేడు(శుక్రవారం) నిరసనలకు దిగారు. విద్యుత్ ఛార్జీల పెంపు(Electricity Charges Increase)పై మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఇచ్చిన పిలుపుమేరకు ఉదయం నుంచే జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ధర్నాల పై కూటమి మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందన్న వైసీపీ ధర్నా పై మంత్రి నిమ్మల తీవ్ర స్థాయిలో స్పందించారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్YS Jagan) హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. తాను పెంచిన విద్యుత్ చార్జీల(Electricity Charges)పై తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచింది జగనే కాబట్టి, ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. డిస్కంలపై రూ.18 వేల కోట్ల బకాయిల భారం పడిందని, అది ఇప్పుడు ప్రజలపై ప్రభావం చూపుతోందని అన్నారు.కమీషన్‌లకు కక్కుర్తిపడి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు.

Tags:    

Similar News