Vijayawada:రేపు మెగా వికసిత్ భారత్ జాబ్ మేళా.. 50కి పైగా ప్రముఖ కంపెనీలు
ఈ నెల 28న శనివారం విజయవాడ, మొగల్రాజపురంలోని వీరమాచనేని పెద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా వికసిత్ భారత్ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
దిశ,వెబ్‌డెస్క్: ఈ నెల 28న శనివారం విజయవాడ, మొగల్రాజపురంలోని వీరమాచనేని పెద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా వికసిత్ భారత్ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు(శుక్రవారం) కలెక్టర్ అధికారులతో కలిసి స్కూల్ ప్రాంగణంలో జాబ్ మేళాకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యువతకు సుస్థిర ఉపాధినిచ్చే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. SSC, Inter, ITI, డిప్లోమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసిన వారికి వివిధ కంపెనీలు ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు. దాదాపు మూడువేల ఖాళీలు అందుబాటులో ఉన్నాయని, 50కి పైగా సంస్థలు ఇందులో పాల్గొంటాయని, ఔత్సాహిక అభ్యర్థులు https://vikasajobs.com/jobmela_register.php?id=690 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 77993 76111, 82974 00777 నంబర్లకు ఫోన్ చేయొచ్చని, సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్ వెంట విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.