Tirumala: లడ్డూ తయారీపై టీటీడీ ఈవో కీలక ప్రకటన

లడ్డూ తయారీపై టీటీడీ ఈవో కీలక ప్రకటన చేశారు...

Update: 2024-12-28 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్: నాణ్యమైన ముడిసరుకులతోనే లడ్డూ(Laddu) తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు(TTD Eo Shyamala Rao) స్పష్టం చేశారు. కల్తీ లడ్డూ ఘటన(Kalti Laddu incident)ను ఉద్దేశించి తిరుమల(Tirupati)తో నిర్వహించిన డయల్ యువర్ ఈవో(Dial Your Eo) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ కోటాను రద్దు చేశామని చెప్పారు. అంగప్రదక్షణ టోకన్లు ఆఫ్‌లైన్‌లోకి తిరిగి తీసుకురావడంలో చాలా సమస్యలున్నాయని ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News