అనంతలో గంజాయి ముఠా అరెస్ట్

అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-12-27 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని ఎవరైనా యువకుల, విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కరాయ సముద్రం సీఐ కరుణాకర్, ఇన్‌ఛార్జ్ సీఐ హేమంత్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్సై రాజశేఖర్ రెడ్డిలకు అందిన పక్కా సమాచారంతో ఈ ముఠాను అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంత, పుట్టపర్తి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో గంజాయి సేవించినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఈ ముఠా సరఫరా చేస్తున్న గంజాయితో పాటు సేవించేందుకు ఖాళీ ఓసిలు, మౌత్ ఫ్రెషనర్స్ మరియు కళ్లు ఎర్రబడకుండా ఉండేందుకు ఐ డ్రాప్స్‌ను సీజ్ చేశారు.


Similar News