పాండ్ యాష్ వివాదం.. L&T కంపెనీకి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

పాండ్ యాష్ వివాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు..

Update: 2024-12-27 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్: పాండ్ యాష్(Pond Yash) వివాదంలో అల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement) యాజమాన్యానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) క్షమాపణలు చెప్పారు. గత ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడ్డానని, తన పొగురు.. ప్రెస్టేజ్ వల్ల పొగొట్టుకున్నానని తెలిపారు. గత ఐదేళ్లు తాను చాలా నష్టపోయానని, దానికి మరెన్నో కారణాలు ఉన్నాయని చెప్పారు. తమకు ఏమీ లేదని, డబ్బులు కోసం పాలిటిక్స్‌లోకి వచ్చారని అంటున్నారని ఆయన మండిపడ్డారు. 125 బస్సులు పొగొట్టుకున్నానని, ఆల్ ఇండియా పర్మిట్‌తో అన్ని చోట్లా బస్సులు నడిపానని పేర్కొన్నారు. పాండ్ యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారని, కానీ ప్రెస్టేజ్ కోసమే అంతా అని తెలిపారు. తమకు చీము రక్తమే ఎక్కువ ఉందని, ఎవరికీ తలవచ్చబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తనతో కష్టంగా ఉందని చెప్పడం బాధకరంగా ఉందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30 వేలు మంది ఉన్నారి, ఫ్లైయాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు. అయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి(Former MLA Peddareddy) తమ ఇంటికి వచ్చారని, సరెండర్ కావాలని, ఊరు విడిచి వెళ్లాలని చెప్పారని, కానీ ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలు తన వెంటనడిచారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News