Fire Accident: అయ్యో అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన కుటుంబం

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సరిహద్దులో అగ్నిప్రమాదం జరిగింది. ...

Update: 2024-12-27 07:59 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సరిహద్దులో అగ్నిప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం పావగడ హరిహరపుర గ్రామం దళితవాడలో సిలిండర్ పేలింది. గుడిసెలో వంట చేస్తుండగా ఒక్కసారిగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే ఇంట్లో ఉన్న దొడ్డణ్ణ, భూతమ్మ, విద్యార్థిని తిప్పమ్మ సురక్షితంగా బయటకు పరుగు తీశారు. అయితే గుడిసె మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న సామగ్రి, నిత్యావసరాలు, సరిఫికెట్లు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. రూ.50 వేల నగదు కూడా అగ్గి పాలైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు ఆర్పే శక్తి లేక గుడిసె దహనాన్ని చూస్తూ ఉండిపోయిన తెలిపారు. తన మనవరాలు పెళ్లికి తెచ్చుకున్న నగలు, డబ్డు అగ్నికి ఆహుతి అయిపోయాయని బాధితుడు దొడ్డణ్ణ వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. 


Similar News