Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. గ్లోబల్ మార్కెట్(Global Market) నుంచి మిక్స్డ్ సిగ్నల్స్(Mixed Signals) రావడంతో ఉదయం గంటపాటు తీవ్ర ఒడిదుడుకులు సూచీలు మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా ఈ రోజు ఫార్మా(Pharma) 1.30 శాతం, ఆటో(Auto) 0.97 శాతం, హెల్త్ కేర్(Health Care) 0.80 శాతం లాభపడటం సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్(Sensex) ఉదయం 78,607.62 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 79,043.15 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 226.59 పాయింట్ల నష్టంతో 78,699.07 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 63.20 పాయింట్లు వృద్ధి చెంది 23,813.40 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.37 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 85.52 వద్ద అల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది.
లాభాల్లో ముగిసిన షేర్లు: టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్
నష్టాల్లో ముగిసిన షేర్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్