Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Update: 2024-12-27 17:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యం పాలై ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS)లో చికిత్స పొందుతూ గురువారం రోజు రాత్రి 9.51 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల చాలా మంది సోషల్ మీడియా వేదికగా సంతాపం(Condolence) వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004 సంవత్సరం నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్.. చాలా సింపుల్‌గా ఉండేవారు. అయితే ఆయన ఆస్తులు విలువ(Assets Value) గురించి చాలా మంది నెటిజన్లు గూగుల్(Google)లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పూర్తి ఆస్తులు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాగా మన్మోహన్ సింగ్ చివరి సారిగా 2019లో రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీ(Rajya Sabha MP)గా సెలెక్ట్ అయ్యారు. ఆ సమయంలో తన ఆస్తులు, అప్పులు, ఆదాయం గురించి నామినేషన్(Nomination) సందర్భంగా వెల్లడించారు. తనకు, తన భార్య గురుశరణ్ కౌర్(Gurusharan Kaur)కు కలిపి మొత్తం రూ.15 కోట్ల 77 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్(Affidavit) లో పేర్కొన్నారు. ఢిల్లీ(Delhi), చండీఘడ్(Chandigarh)లో రెండు ప్లాట్లు, మారుతి 800(Maruthi 800) కారు ఉందని తెలిపారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో రూ. 3.46 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక షేర్లు(Shares), బాండ్లు(Bonds) లేదా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds)లో తాను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఎలాంటి అప్పులు(Debts) లేవని అఫిడవిట్ లో పేర్కొనడం ఆయన ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. కాగా లోన్లు(Loans) తీసుకోవడానికి మన్మోహన్ సింగ్ ఏమాత్రం ఆసక్తి చూపించేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.


Similar News