ఏ మాత్రం టైమ్ దొరికినా నేను నా భార్యతో కలిసి ఆ పని చేస్తా.. హీరో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న షో ‘అన్‌స్టాపబుల్-4’(Unstoppable-4 show).

Update: 2024-12-27 11:06 GMT

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న షో ‘అన్‌స్టాపబుల్-4’(Unstoppable-4 show). ఈ టాక్ షోకు సెలబ్రిటీలు వస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్‌స్టాపబుల్-4లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) పాల్గొని సందడి చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకు వచ్చిన వెంకటేష్.. సినిమా విశేషాలతోపాటు పర్సనల్ విషయాలు కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా.. వెంకటేష్ తన వైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నా సతీమణి నీరజ(Neeraja) నా బెస్ట్ ఫ్రెండ్. ఏ మాత్రం టైమ్ దొరికిన మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. టూర్స్‌కు వెళ్తాం. అంతే కాదు.. ఆమెతో కలిసి నేను కూడా అప్పుడప్పుడూ గరిట తిప్పుతుంటా. అది నాకెంతో నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా.. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary)హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News