Dream Catcher : ‘డ్రీమ్ క్యాచర్’ నుంచి ట్రైలర్ రిలీజ్ .. డ్రీమ్స్ మీద నడిచే కథ..

సందీప్ కాకుల డైరెక్షన్‌లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ వంటి ప్రముఖులు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’(Dream Catcher).

Update: 2024-12-28 03:03 GMT

దిశ, సినిమా: సందీప్ కాకుల డైరెక్షన్‌లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ వంటి ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’(Dream Catcher). సియెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ జనవరి 3న థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట ఆకట్టుకుంటుంది. ఇక దీన్ని చూసిన ప్రేక్షకులు.. స్టోరీ కొత్తగా ఉందని, విజువల్స్, గ్రాఫిక్స్ అన్ని హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ట్రైలర్‌ను చూసినట్లయితే.. ఓ వ్యక్తికి వచ్చే కలల ఆధారంగా కథ నడుస్తుందని, అతనికి వచ్చే కలల వల్ల అతను, అతని చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో ఈ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News