PhD student: పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్

పీహెచ్‌డీ విద్యార్థిని పులిపర్తి దీప్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-12-27 11:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పీహెచ్‌డీ విద్యార్థిని పులిపర్తి దీప్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని దీప్తి ఆత్మహత్య చేసుకున్నది. దీప్తి సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకోని నాచారం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సంగీతరావు, అనిత, ఆమె సోమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనిత భర్త అనిల్, సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా, నాచారంలోని బాపూజీనగర్ సరస్వతీకాలనీకి చెందిన దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీత రావు ఐఐసీటీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనిల్‌తో పరిచయం ఏర్పడింది. అనిల్ భార్యకు అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో రూ.15 లక్షలు సంగీతరావు తీసుకున్నారు. డబ్బులు తీసుకోని రెండేళ్లు దాటిన ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో దీప్తి, సంగీతరావు మీద అనిల్ తన భార్యతో నాచారం స్టేషనల్‌లో చీటింగ్ కేసు పెట్టారు.

అదేవిధంగా అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగే వాడు. మరోవైపు కోర్టులో వారిపై సివిల్ దావా కూడా వేశాడు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం రాత్రి సమయంలో చున్నీతో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో ఆధారంగా నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News