రూటు మార్చిన వైద్యశాఖ.. ఉద్యోగాల భర్తీకి కొత్త ప్లాన్
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైద్యారోగ్యశాఖలో భర్తీలు జరగనున్నాయి. కొత్త నియామకాలు జరగడం లేదని కొన్నేళ్లుగా కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు, నర్సులు,
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైద్యారోగ్యశాఖలో భర్తీలు జరగనున్నాయి. కొత్త నియామకాలు జరగడం లేదని కొన్నేళ్లుగా కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు, నర్సులు, పారమెడికల్ స్టాఫ్సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడకూడదని వేగంగా ఖాళీలను నింపేందుకు ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన 12,755 ఖాళీలను గరిష్ఠంగా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఈ సారి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
వైద్యవిభాగంపై మెడికల్ బోర్డు స్టాఫ్ కు పూర్తి స్థాయిలో పట్టు ఉన్న నేపథ్యంలో వేగంగా భర్తీలు జరుగుతాయని ప్రభుత్వం ఆశీస్తున్నది. ఇప్పటికే సర్కార్ మెడికల్ బోర్డుకు అంతర్గత ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ షురూ కానున్నట్లు ఓ ఉన్నతాధికారి 'దిశ'కు తెలిపారు. డైరెక్టర్ఆఫ్పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ఆఫ్మెడికల్ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగాల్లోని ఖాళీలను బోర్డు ద్వారానే నింపుతామని చెప్పారు.
నర్సుల ఖాళీలే ఎక్కువ...
హెల్త్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా స్టాఫ్‌నర్సు పోస్టులే ఖాళీగా ఉన్నాయి. మెడికల్ఎడ్యుకేషన్పరిధిలో 4400, టీవీవీపీలో 700, డైరెక్టర్ఆఫ్పబ్లిక్ హెల్త్‌లో దాదాపు మరో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. అంటే ప్రభుత్వం గుర్తించిన ఖాళీల మొత్తంలో దాదాపు సగం పోస్టులు స్టాఫ్‌నర్సు ఖాళీలే. ఈ పోస్టుల కొరకు సుమారు 25 వేల మంది వరకు పోటి పడే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇక
టీచింగ్ఆసుపత్రుల్లో 1600 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, టీవీవీపీ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 12 వందల సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 800 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, పారామెడికల్, అడ్మినిస్ర్టేటీవ్, తదితర పోస్టులన్ని కలిపి సుమారు 2500 వరకూ ఉంటాయని ఓ అధికారి చెప్పారు. అయితే వీటన్నింటిని విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.