అరెకరం భూమి ఉన్న ఎమ్మెల్యేకు వందల ఎకరాలు ఎక్కడివి..?

Update: 2022-03-03 16:55 GMT

దిశ, మొయినాబాద్: ఎమ్మెల్యే యాదయ్య ఎంతటి నీతిపరుడో ఏ పార్టీలో నీతి పరంగా ఉన్నాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ధ్వజమెత్తారు. రత్నం అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు అంటూ ఎమ్మెల్యే తనపై ఆరోపణలు చేయడం సరికాదంటూ ఆయన మండిపడ్డారు. కాలె యాదయ్య చేసినటువంటి అవినీతి అంతా ఇంతా కాదు చేవెళ్ల నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రతి వెంచర్ లో ఆయనకు ప్లాట్ లు ఉన్నాయని, అరెకరం భూమి ఉన్న ఆయనకు ఇప్పుడు వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు కాలే యాదయ్య ప్రవర్తన ఉందని అన్నారు. అభివృద్ధి మరచి పూర్తి అవినీతిలో నిమగ్నమైన కాలె యాదయ్య తనపై నిందలు వేయడం సరికాదంటూ రత్నం అన్నారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని.. కాలె యాదయ్య శిక్షకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. కాలె యాదయ్య చేసే ప్రతి అవినీతిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తనపై కాలె యాదయ్య చేసినటువంటి ఆరోపణలను పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని.. అప్పుడు ఎవరు నీతిపరులు ఎవరు అవినీతిపరులో తెలుస్తదని ఆయన అన్నారు. 


Similar News