సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో ట్విస్ట్

ప్పష్ప - 2 ప్రిమియర్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య 70 ఎంఎం లో జరిగిన తొక్కిసలాట కేసులో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది.

Update: 2024-12-18 17:19 GMT

దిశ, సిటీక్రైం : ప్పష్ప - 2 ప్రిమియర్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య 70 ఎంఎం లో జరిగిన తొక్కిసలాట కేసులో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు లో పుష్ప - 2 సినిమా విడుదల, ప్రిమియర్ షో సందర్బంగా సంధ్య 70 ఎం ఎం లో లైట్ లు పెట్టిన వ్యక్తిని కూడా రిమాండ్ చేశారు. థియేటర్ లో లైట్ లు పెట్టిన వ్యక్తికి తొక్కిసలాట కు ఎం సంభంధం ఉందొ తెలియదు కాని పోలీసులు కిరణ్ కుమార్ గౌడ్ ను ఏ -19 గా సంధ్య 70 ఎం ఎం కేసు లో రిమాండ్ చేసారు. ఇదే కేసులో సిని నటుడు అల్లు అర్జున్ ఏ -11 గా ఉన్న విషయం తెలిసిందే. అయ్యితే ఏ -19 గా రిమాండ్ అయ్యిన కిరణ్ కుమార్ గౌడ్ ఎం తప్పు చేసాడో తెలియదు కాని తొక్కిసలాటలో రేవతి మృతి తో పాటు, ఆమె కుమారుడు శ్రీ తేజ్ విషమ పరిస్థితుల్లో ఉండడానికి ఎలా కారణమయ్యాడో తెలియడం లేదు. ఏ -19 గా రిమాండ్ అయ్యిన కిరణ్ వృత్తిని ఎలక్ట్రీషియన్ గా చిక్కడిపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లు పేర్కొన్న వైనం ఇప్పుడు పోలీసు, న్యాయ వాదులు, సామాన్య ప్రజల వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది పోలీసులు తమ తప్పిదాన్ని తప్పించుకునే క్రమంలో చేస్తున్న తప్పిదాలన్ని ఈ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News