Osmania University : ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల అరెస్ట్
ఉస్మానియా విశ్వవిద్యాలయం(OU)లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులకు(BRS Student Leaders) పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం(OU)లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులకు(BRS Student Leaders) పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు జరుపుతున్న కృతజ్ఞత సభను అడ్డుకునేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ విభాగం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటని వారు ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని, విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని కాంగ్రెస్ అబద్దాలు చెప్పిందని మండిపడ్డారు. పోలీసులు వెంటపడి అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరు అని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు.