ABVP: ఈ నెల 23 నుంచి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు.. గోడ పత్రిక ఆవిష్కరణ
ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు 43 వ ఏబీవీపీ రాష్ట్ర మహా సభలు జరగనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు 43 వ ఏబీవీపీ రాష్ట్ర మహా సభలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆవిష్కరణ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు చెలిమెల దృహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది ABVP యొక్క 43వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో డిసెంబర్ 23,24,25 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సభల్లో తెలంగాణలో నెలకొన్నటువంటి విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున ఈ సభలకు విద్యార్థులు మేధావులు నిరుద్యోగులు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యదర్శి శివ, జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్, సిటీ సెక్రెటరీ పృథ్వి తేజ, జాతీయ మీడియా టోలి మెంబర్ శ్రీహరి,రాష్ట్ర కర్యాసమితి సభ్యులు సుమన్ శంకర్, కమల్ సురేష్, అలివేలి రాజు, స్టేట్ సావిష్కర్ కన్వీనర్ తోట శ్రీనివాస్, విద్యార్థి నాయకులు నరేందర్, ఎల్లాస్వామి, రమేష్, శివశంకర్, కళ్యాణ్, శివ, మహేష్, ధనరాజ్, సందీప్ పాల్గొన్నారు.