NIACL Recruitment: డిగ్రీ అర్హతతో ఇన్సూరెన్స్ కంపెనీలో 500 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

ప్రభుత్వ రంగ సంస్థ, ముంబై(Mumbai)లోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ 'ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-12-18 17:21 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ, ముంబై(Mumbai)లోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ 'ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఏపీ(AP)లో 10, తెలంగాణ(TG)లో 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ http://www.newindia.co.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 1 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

అసిస్టెంట్ - 500

విద్యార్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్స్ ఎగ్జామ్‌, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వయోపరిమితి:

వయసు 1 జనవరి 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

పరీక్ష తేదీలు:

జనవరి 25న ప్రిలిమ్స్, మార్చి 2న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News