RPF SI Preliminary Key: ఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కీ విడుదల..!
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)లోని సబ్-ఇన్స్పెక్టర్(SI) పోస్టుల నియామకం కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)లోని సబ్-ఇన్స్పెక్టర్(SI) పోస్టుల నియామకం కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 462 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి నియామక పరీక్షలను డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీలలో నిర్వహించారు. ఇదిలా ఉంటే.. సబ్-ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ప్రిలిమినరీ కీ(Preliminary key)ని రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.rrb.gov.in/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి కీతో పాటు రెస్పాన్స్ షీట్(Response Sheet) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు కీపై ఏమైనా అభ్యంతరాలు(Objections) ఉంటే డిసెంబర్ 22 లోగా తెలియజేయవచ్చు. కాగా రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు.