సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల జాడే లేదు ?
దిశ, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని,
దిశ, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల తర్వాత కార్మిక సంఘం ఎన్నికలకు వెళ్లడానికి ఆలోచిస్తున్నారని కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కసరత్తులు ఫలిస్తాయా..! టీబీజీకేఎస్ పార్టీని వీడిన నాయకులు తిరిగి గూటికి రావడం వల్ల బొగ్గు గని కార్మిక సంఘం బలోపేతం అవుతుందా..? మరింత బలహీన పడుతుందా..? అనే చర్చ ఇప్పుడు ఇదే కోల్ బెల్ట్‌లో హాట్ టాఫిక్‌గా మారింది.
సింగరేణి క్షేత్రలలో రాజకీయ సమీకరణాలు మారుతున్న కోల్ బెల్ట పై పట్టు నిల తొక్కేందుకు టిఆర్ఎస్ సీరియస్ గా కసరత్తులు చేస్తున నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ తలనొప్పిగా మారిన, కార్మిక సంఘం ఎన్నికలలో టీబీజీకేఎస్‌ను గెలిపించే దిశగా టీఆర్ఎస్ నడుం బిగిస్తోంది. సంఘ నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తు గతంలో అవమానంతో సంఘం ప్రెసిడెంట్ వీడిన కెంగర్ల మల్లయ్య ను తిరిగి అదే పదవిని కట్టబెడుతూ రప్పించడం, పైగా కెంగర్ల మల్లయ్య నియామకాన్ని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం యూనియన్ ప్రెసిడెంట్‌గా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గా మిరియాల రాజి రెడ్డిలు వ్యవహరిస్తున్న వీరి ఇరువురి మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఎన్నో సందర్భాలలో బయట బడింది. వీరికి తోడు మల్లయ్య చేరడంతో ఒకే ఆర్రలో మూడు కత్తులు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
యూనియన్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. గతంలో తొలిసారిగా టీబీజీకేఎస్ కార్మిక సంఘం గెలిచిన సమయం నుండే అప్పటి అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజి రెడ్డి మధ్య వర్గా పోరు వల్ల ఒక దశలో యూనియన్ రెండుగా చీలిపోయిన సందర్భం లేకపోలేదు. కేసులు, అరెస్టుల తరువాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంతర్గత ఎన్నికలకు కారణమైంది. ఆ ఎన్నికల్లో మిరియాల రాజి రెడ్డి వర్గం గెలిచింది ఆ తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత బాధ్యతలు స్వీకరించారు. కవిత ఎంట్రీతో కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐ.ఎన్.టి.యు.సి సింగరేణి విభాగం అధ్యక్షుడు వెంకట్రావు చేరికతో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రాజి రెడ్డిని నియమించారు. టీబీజీకేఎస్‌లో పరిస్థితి మారకపోవడం యూనియన్ నేతల తీరుతో కోల్ బెల్ట్‌లో పరిస్థితి చేజారింది.
2017 లో జరిగిన సింగరేణి గుర్తిపు కార్మిక సంఘం ఎన్నికలో టీబీజీకేఎస్ గెలుపు కోసం టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి కారణం కార్మిక గుర్తింపు సంఘంలోని నాయకుల వర్గపోరు. యూనియన్ నేతలను నమ్ముకుంటే ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ అప్పట్లో అంచనాకు వచ్చారు. పోల్ మేనేజ్మెంట్‌లో మంచి అనుభవం ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ముఖ్య నేతను సింగరేణి వ్యాప్తంగా మోహరించారు. యూనియన్ నేతల ప్రస్తావన రాకుండా, పోస్టర్‌లో యూనియన్ నాయకుల ఫోటోలు లేకుండా ప్రచారం చేసి టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఎన్నికలో గెలిచిన యూనియన్ నేతల తీరుపై కేసీఆర్ ఆగ్రహం చాలా రోజుల పాటు కార్యవర్గాన్ని ప్రకటించకుండా, నాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదే పనిగా యూనియన్ నేతల అంతా మంత్రుల చుట్టూ తిరిగిన రోజులు లేకపోలేదు. ఇప్పటికైనా నాయకులు వర్గ పోరు పక్కనబెట్టి టీబీజీకేఎస్ కార్మిక పార్టీని ముందుకు తీసుకెళ్తారా చూడాలి.
టీబీజీకేఎస్ ప్రయోజనమే ఎన్నికలు ఆలస్యం
సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్ ప్రయోజనం కోసమే ఎన్నికలను ఆలోచన చేస్తోంది. సింగరేణిలో టీబీజీకేఎస్ పట్ల వ్యతిరేకత నెలకొంది. దీంతో ఎన్నికలకు వస్తే టీవీ కేసు ఓడిపోతుందని భయంతో ప్రభుత్వం ఎన్నికలు జాప్యం వేయాలని సింగరేణినికి ప్రభుత్వ ఆదేశం ఉన్నది. అందుకనే యజమాన్యం సింగరేణి ఎన్నికలను చర్చల పేరిట నానుస్తున్నది. ఇప్పటికైనా యజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కుక్కల ఓదెలు, ఐ. ఎన్. టి. సి మందమర్రి ఏరియా కార్యదర్శి
ఓటమి భయంతోనే ఎలక్షన్ జాప్యం
టీబీజీకేఎస్ ఓడిపోతుందని భావనతో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలను జాప్యం చేస్తోంది. సింగరేణిలో టీబీజీకేఎస్ పనితీరు కార్మిక వ్యతిరేకతకు గురైంది. వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో తమ సంఘం ఎక్కడ ఓడిపోతుందో అనే భయంతో ప్రభుత్వమే సింగరేణి ఎన్నికలను జరపకుండా ఆపింది. సింగరేణి యజమానికి తెరవెనుక ఆదేశాలు అందాయి. అందుకనే కాలపరిమితి ముగిసిన గుర్తింపు సంఘం ఎన్నికను చేపట్టడం లేదు. సింగరేణిలో టీబీజీకేఎస్ గెలిచే పరిస్థితి లేకపోవడంతో తో యజమాన్యం ఎన్నికలను వాయిదా వేస్తూ ఆ సంఘం నాయకులకు వత్తాసు పలుకుతున్నది.
పేరం శ్రీనివాస్, ఐ. ఎన్. టి .యు. సి. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు