విడాకుల కోసం భార్యతో కోర్టు మెట్లెక్కిన స్టార్ డైరెక్టర్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) అందరికీ సుపరిచితమే.

Update: 2025-03-25 02:22 GMT
విడాకుల కోసం భార్యతో కోర్టు మెట్లెక్కిన స్టార్ డైరెక్టర్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళంలో అడపాదడపా సినిమాలు చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే జీవీ ప్రకాష్ సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి అన్నీ అనే కూతురు కూడా ఉంది. అయితే ఇటీవల ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఇక విడాకుల ప్రకటన విడుదల చేసినప్పటికీ నుంచి వేర్వేరుగానే నివసిస్తున్నారు.

కానీ పలు ఈవెంట్స్‌లో మాత్రం ఇదవరకు ఉన్నట్లుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, జీవీ ప్రకాష్ కుమార్, సైంధవి (Saindhavi)చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకి ఓకే కారులో వెళ్లారు. విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. కానీ అది వాయిదా పడటంతో తిరిగి అదే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. సాధారణంగా విడాకులు తీసుకునే వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడివిడిగా వస్తుంటారు. కానీ వీరిద్దరు కలిసి ఓకే కారులో రావడంతో అక్కడున్న వాళ్లతో పాటు నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో అర్థం కాక పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరైతే మళ్లీ కలిసిపోతారని అంటున్నారు.

Tags:    

Similar News