జమ్ముకశ్మీర్‌ను శాంతి జోన్‌గా ప్రకటించండి : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీపై మరోసారి విరుచుకపడ్డారు.

Update: 2022-07-28 11:09 GMT

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీపై మరోసారి విరుచుకపడ్డారు. అధికార పార్టీ జాతీయ జెండాను రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అయితే చైనా అక్రమణలో ఉన్న లఢక్ భూభాగంలో జెండాను ఎగరవేయాలని కోరారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌ను శాంతి జోన్‌గా ప్రకటించాలని ప్రధాని మోడీని కోరారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) మీదుగా అన్ని మార్గాలను తెరవడం ద్వారా, సార్క్ సభ్య దేశాలకు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతులు ఇవ్వాలని అన్నారు. గురువారం పీడీపీ 23‌వ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలు తప్ప మరో మార్గం లేదని ఆమె అన్నారు. 'మీరు జాతీయ జెండాను ఎగరవేయాలనుకుంటే చైనా అక్రమణలో ఉన్న 1000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో జెండా ఎగరవేయండి. కానీ మీరు జాతీయ జెండాను కూడా రాజకీయం చేస్తున్నారు' అని అన్నారు. కాగా, సోమవారం భారీ భద్రత నడుమ బీజేపీ కార్యకర్తలు లాల్ చౌక్ లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 


Similar News