'ఆదివాసీపై అధికారుల దుర్మార్గ చర్యలు.. దాహమేస్తుందంటే మూత్రం తాగమన్నారు..!' (వీడియో)

దిశ, నర్సంపేట : సోలం బాబు అనే ఆదివాసి రైతుపై దాడి చేసి, మూత్రం తాగించేలా దుర్మార్గంగా ప్రవర్తించిన..latest telugu news

Update: 2022-03-12 15:11 GMT

దిశ, నర్సంపేట : సోలం బాబు అనే ఆదివాసి రైతుపై దాడి చేసి, మూత్రం తాగించేలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఫారెస్ట్ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని కామ్రేడ్ మోడెం మల్లేశం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పుట్టల భూపతి గ్రామానికి చెందిన సోలం బాబు అనే రైతును ఫారెస్ట్ అధికారులు కర్రలతో కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన బాబు దాహం వేస్తుందని ప్రాధేయ పడగా.. మూత్రం తాగాలని ఫారెస్ట్ అధికారులు అతి నీచంగా ప్రవర్తించారని ఆరోపించారు.

సొమ్మసిల్లి పడిపోయిన బాబురావును తన పోడు భూమి దగ్గర నుండి తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారన్నారు. 30-40 ఏండ్లుగా ఆ భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీ పట్ల అటవీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ఆదివాసీ గిరిజన రైతుపై దాడులకు పాల్పడిన ఫారెస్టు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మానవత్వం మరిచిపోయి ప్రవర్తించిన గంగారం రేంజర్ చలపతిరావు, డీఆర్వో కరుణా నాయక్ లపైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News