April 1 నుంచి ముఖ్యమైన పథకాలలో కీలక మార్పులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీసారి ఆర్థిక సంవత్సరం ముగింపు తరువాత కొన్ని ఆర్థిక ..telugu latest news

Update: 2022-03-28 14:56 GMT
April 1  నుంచి ముఖ్యమైన పథకాలలో కీలక మార్పులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీసారి ఆర్థిక సంవత్సరం ముగింపు తరువాత కొన్ని ఆర్థిక పరమైన అంశాలలో మార్పులు వస్తాయి. ఈ ఏడాది మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు కూడా ఆర్థిక పరమైన అంశాలలో అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి, ఆర్థికంగా ఎలాంటి నష్టం రాకుండా ఉండాలంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు కొత్త మార్పుల గురించి తెలుసుకోవాలి. ఆ మార్పులు ఏమిటో ఒకసారి చూద్దాం..

పోస్టాఫీసు పథకం

ఏప్రిల్ 1వ తేదీ నుంచి పోస్టాఫీసులోని కొన్ని స్కీమ్‌ల నిబంధనలు మారుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కస్టమర్లు టైమ్ డిపాజిట్ ఖాతా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడానికి పొదుపు ఖాతా లేదా బ్యాంక్ ఖాతాను తెరవాలి. దీనితో పాటు, చిన్న పొదుపులో డిపాజిట్ చేసిన మొత్తానికి గతంలో అందుబాటులో ఉన్న వడ్డీ ఇప్పుడు పోస్టాఫీసులోని పొదుపు ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

ఇల్లు కొనుగోలు

ఏప్రిల్ 1 నుంచి, మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్ 80EEA కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయబోతున్నందున ఇల్లు కొనడం ఖర్చుతో కూడుకుంది.

పెరిగిన 800 మందుల ధరలు

పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ వైరస్ సహా 800 కి పైగా మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10 శాతానికి పైగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) టోకు ధరల సూచిక (WPI)ను 10.7 శాతం పెంచింది.

యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్

యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నెలవారీ బ్యాలెన్స్ పరిమితిని రూ.10,000 నుంచి రూ.12,000కి పెంచింది.


అమ్మాయి రూపంలో ఉన్నా.. పురుషుడి కోరికలున్నాయా? అయితే ఇది తెలుసుకోండి


Changes from 1st April that will affect your life

Tags:    

Similar News