Rain Alert : తెలంగాణలో వడగండ్ల వాన
తెలంగాణ(Telangana)లో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగండ్ల వాన(Hailstrom) కురిసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా.. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మార్కెట్ యార్డ్స్ లో ఉన్న ధాన్యాలు, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయాయి. కాగా శని, ఆదివారాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) పేర్కొంది. మరోవైపు ఏపీ(AP)లో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మూడు రోజుల అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.