Rain smell: వర్షం వచ్చే ముందు మట్టి వాసన అంటే ఇష్టమా? మరీ అదేలా వస్తుందో తెలుసా?

వర్షం వచ్చే ముందు, వర్షం పడడం ప్రారంభం కాగానే వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా.

Update: 2025-03-20 04:08 GMT
Rain smell: వర్షం వచ్చే ముందు మట్టి వాసన అంటే ఇష్టమా? మరీ అదేలా వస్తుందో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వర్షం (Rain) వచ్చే ముందు, వర్షం పడడం ప్రారంభం కాగానే వచ్చే మట్టి (Soil) వాసన ఎంత బాగుంటుందో కదా. మాటల్లో వర్ణించలేం. మనలో ఎంతో మందికి ఈ సువాసన (Aroma) అంటే ఇష్టం. కానీ, ఈ వాసన రావడానికి గల అసలు కారణాలు చాలా మందికి తెలియదు. నిజానికి ఇది మట్టి నుంచి వచ్చేది కాదు.. ఈ వాసనను బ్యాక్టీరియా వెదజల్లుతుంది. అంతేకాదు, ఈ సువాసనను 'పెట్రిచోర్' అని పిలుస్తారు. ఆశ్చర్యంగా, ఆసక్తిగా ఉందా? పూర్తిగా తెలుసుకోండి మరీ.

సాధారణంగా పొడిబారి ఎండిపోయిన నేలపై కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇందులో యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా పొడి నేలలో బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇవి తొలకరి జల్లులు ప్రారంభం కాగానే విచ్ఛినమై జియోస్మిన్ అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాల కారణంగానే పెట్రిచోర్ (Petrichor) వాసన వస్తుంది. ఇది గాలిలో వేగంగా కలిసిపోవటం వల్ల మనకు మట్టి వాసన భావాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, పలు రకాల చెట్లు నేలలో ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. తేలిక పాటి జల్లులు కురిసినప్పుడు ఆ ఆయిల్స్ వర్షం నీటితో రసాయనిక చర్య జరిపి గాలిలోకి ఈ వాసనను విడుదల చేస్తుంటాయి. ఇక ఈ వాసన పీల్చుకోవటం ఆహ్లాదకరమైన భావన కలుగుతుంది.

READ MORE ...

Irula Tribe: వీరికి పాములు ఆట బొమ్మలతో సమానం.. పిల్లలు కూడా విషాన్ని తీయగలరు..!


Tags:    

Similar News