తిరుపతిలో ఆ హోటల్‌కు అనుమతి రద్దు.. శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న హిందువులు

తిరుపతి అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి రద్దు చూస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు..

Update: 2025-03-21 12:53 GMT
తిరుపతిలో ఆ హోటల్‌కు అనుమతి రద్దు.. శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న హిందువులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అలిపిరి(Tirumala Alipiri) వద్ద ముంతాజ్ హోటల్(Mumtaz Hotel) నిర్మాణం జరుగుతోంది. అయితే హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు కొద్ది రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నాయి. ముంతాజ్ హోటల్‌కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అయితే హిందూసంఘాల ధర్నాకు ఈ రోజు ఫలితం దక్కింది. తిరుమల(Tirumala) పర్యటనలో సీఎం చంద్రబాబు.. అలిపిరిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హిందూ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారికి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆనందం వ్యక్తం చేశారు. 

కాగా ముంతాజ్ హోటల్‌కు జగన్ ప్రభుత్వం(Jagan Government) 35 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో అప్పట్లోనే హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హిందుసంఘాల ప్రతినిధులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన 35 ఎకరాలను టీటీడీకి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News