love marriage:‘నువ్వే జీవితం.. నువ్వే నా ప్రాణం’.. పెళ్లి చేసుకున్న 9 నెలలకే షాకిచ్చిన భర్త!
ఆరు సంవత్సరాలుగా ప్రేమించాడు నువ్వే జీవితం అన్నాడు.

దిశ ప్రతినిధి, చిత్తూరు: ఆరు సంవత్సరాలుగా ప్రేమించాడు నువ్వే జీవితం అన్నాడు. నువ్వే ప్రాణం నువ్వే సర్వస్వం అంటూ కులాంతర వివాహం చేసుకొని తొమ్మిది నెలలు గడవక ముందే భార్యను వదిలేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం లో మబ్బు వారి పేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం కావాలంటూ భార్య భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. వివరాల్లోకెళితే.. గంగవరంకు చెందిన భరత్ మబ్బువారి పేటకు చెందిన రమ్యశ్రీ లు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
9 నెలల తర్వాత భార్యను పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. నెలలు గడుస్తున్న భర్త తిరిగి అత్తారింటికి తీసుకెళ్ళకపోవడం, భర్త నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో రమ్యశ్రీ అత్తారింటికి చేరుకుని వారిని నిలదీసింది. వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో తన భర్తను అత్తామామే దాచిపెట్టి వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇంటి ముందు కూర్చుని నిరసన చేపట్టారు. రమ్యశ్రీ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా నిరసనకు దిగారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని రమ్యశ్రీ డిమాండ్ చేస్తుంది.