తిరుమలలో భక్తుల మధ్య తోపులాట.. గాజు బాటిల్‌తో దాడి
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం ఎల్లవేళలా ప్రశాంతతకు నిలయం.

దిశ, తిరుమల: తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం ఎల్లవేళలా ప్రశాంతతకు నిలయం. అటువంటి పుణ్యక్షేత్రం లో భక్తుల మధ్య మాట మాట పెరగడంతో ముష్టి యుద్ధానికి దారి తీసిన ఘటన సి ఆర్ ఓ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం మేరకు తమిళనాడు భక్తుడి కుమారుడు కూర్చున్న చోట నుండి కర్ణాటక కు చెందిన భక్తుడు కాస్త ముందుకి నెట్టడంతో రగడ మొదలైంది.
నా కుమారుడ్నే కిందకి తోస్తావా అంటూ తమిళనాడు భక్తుడు వారిపైకి వాగ్వాదానికి దిగడంతో కర్ణాటక భక్తుడి తోటివారు పదిమందికి పైగా తమిళనాడు భక్తునిపై వీరుచుకుపడటంతో భక్తుడు వారిలో ఒకరిని గాజు బాటిల్ తో తలపై బాది తీవ్ర గాయాలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురు భక్తులను విడదీసి వారిని అదుపులోకి తీసుకున్నారు.