మూసీ ప్రక్షాళనకి నిధులు ఇవ్వండి

మూసీ ప్రక్షాళనకి నిధులు ఇవ్వండని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

Update: 2025-03-21 13:00 GMT
మూసీ ప్రక్షాళనకి నిధులు ఇవ్వండి
  • whatsapp icon

దిశ, మేడ్చల్ బ్యూరో : మూసీ ప్రక్షాళనకి నిధులు ఇవ్వండని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి జీవనాడిగా ఉన్న మూసీ నది నేడు పూర్తి కాలుష్య కారకంగా మారి విషపూరిత జలాలతో నిండి ఉన్నదని, దీనిని శుద్ధి చేసేందుకు అవసరమైన అత్యధిక ఎస్టీపీ ప్లాంట్స్ నిర్మాణం తోపాటుగా ఇతర అభివృద్ధి పనులకు గాను ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పార్లమెంటులో ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కోరారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్లపై మాట్లాడే అవకాశం లభించడంతో ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మురుగునీరు, అదే విధంగా హైదరాబాద్ నగరం మూసీ నది ద్వారా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రస్తావించారు.

మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు..

రోజురోజుకు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పలు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సమయంలో స్మార్ట్ సిటీ మిషన్, అమృత్ వంటి పథకాలతో పారిశుద్ధ్యం, సురక్షితమైన తాగునీటి సౌకర్యాల నిమిత్తం వేలకోట్ల రూపాయలను కేటాయించడం ప్రశంసనీయమని అన్నారు.

    అయితే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రజలు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో నివసిస్తున్నారని, ఈ క్రమంలో వారికి సురక్షిత మంచినీరు అందించడంతో పాటుగా మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటుగా హైదరాబాద్ నగరానికి ప్రధానమైన మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. 


Similar News