ఎవరేంటో ప్రజలందరికీ తెలుసు.. సీఎంతో భేటీ తర్వాత హరీష్ రావు షాకింగ్ కామెంట్స్

కేంద్రంలోని బీజేపీ(BJP), రాష్ట్రంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2025-03-21 13:03 GMT
ఎవరేంటో ప్రజలందరికీ తెలుసు.. సీఎంతో భేటీ తర్వాత హరీష్ రావు షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ(BJP), రాష్ట్రంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ‘బడే భాయ్.. చోటే భాయ్’(మోడీ-రేవంత్ రెడ్డి) బంధం బయటపడిందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వకపోయినా ఆర్థిక మంత్రి భట్టి ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనలేదు. అక్కడే అందరికీ తెలిసిపోయింది.. ఈ రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు.

బీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలు రెండూ సమాన శత్రువులే అని.. ఈ రెండింటితోనూ సమాన దూరం పాటిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. భట్టితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని పల్తెత్తు మాట అనలేదని అన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) సైతం బడ్జెట్ మీద కంటే.. బీఆర్ఎస్ మీదే ఎక్కువ విమర్శలు చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ - కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని బుదరజల్లె ప్రయత్నాలు చేసినా.. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.

‘బడ్జెట్ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద నేను మాట్లాడినంత గట్టిగా మరెవరూ మాట్లాడలేదు. నా ప్రసంగం మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపైనే ఉంది. మహేశ్వర్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు’ అని అన్నారు.

సీఎం రేవంత్‌తో భేటీపై హరీష్ రావు వివరణ:

‘సీతాఫల్ మండిలో పెండింగ్‌లో ఉన్నటువంటి SDF నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాం. సీతాఫల్ మండిలో హైస్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోటా ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో రూ.32 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయి. SDF నిధులు విడుదల చేయాలని అడిగేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము. ఈ విషయంపై వారికి రిప్రజంటేషన్ ఇచ్చాము’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News