రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Update: 2025-03-22 05:34 GMT
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని (Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా రేషన్ కార్డు (Ration card) ఉన్నవారికి ప్రభుత్వం మరో శుభవార్తను అందించేందుకు సిద్ధం అయింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి.. ఉచితంగా సన్నబియ్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సన్న బియ్యం పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా ప్రతి నేల దాదాపు 2 కోట్ల మందికి పైగా లబ్దిదారులు.. ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందుకోనున్నారు. ఈ నెల 30 ఉగాది రోజు సీఎం ప్రారంభించగా.. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో.. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఈ సన్నబియ్యం ఇవ్వనున్నారు. దీంతో పేద ప్రజల ఆకలి బాధలు తీర్చనున్నారు. అయితే గతంలోనే రేషన్ కార్డులపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కలిపి రేషన్ బియ్యం అందిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సన్న బియ్యం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


Similar News