భూ ధరలు పెంచబోతున్నాం.. ఈ సర్వే కోసం ట్రైనింగ్ ఇస్తాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో త్వరలో.. భూ ధరలు పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-24 11:24 GMT
భూ ధరలు పెంచబోతున్నాం.. ఈ సర్వే కోసం ట్రైనింగ్ ఇస్తాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో.. భూ ధరలు (land prices) పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ను నియమిస్తామని చెప్పారు. అలాగే లైసెన్డ్ సర్వేయర్‌లకు అవకాశం ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్‌లకు అవకాశం ఇస్తామని, వీరికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ LRS స్కీమ్ మార్చి 31 వరకు గడువు ఉందని, ఆ లోగా చేసిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ LRS ఇప్పుడు కాకుండా ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం ఎల్ఆర్ఎస్ LRS కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అర్బన్ ఏరియాలో 1 లక్షా 13 వేల ఇళ్ల మంజూరు

కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్షా 13 వేల ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. అలాగే సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తులు స్వీకరించమని స్పష్టం చేశారు. 13 లక్షల పాత దరఖాస్తులను గత ప్రభుత్వం రిజక్ట్ చేసిందని ఆరోపించారు. రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్ చేసుకోవచ్చని వెల్లడించారు. నాకు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మధ్య ఎలాంటి సమస్య లేదు.. నాకు ఏ ఎమ్మెల్యేతో సమస్య లేదు.. అని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు.. అని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News