Bandi Sanjay : MMTS బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
ఆదివారం హైదరాబాద్ శివారులో జరిగిన ఎంఎంటీఎస్ ఘటన(MMTS Train Incident)లో బాధితురాలిని బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్లో పరామర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం హైదరాబాద్ శివారులో జరిగిన ఎంఎంటీఎస్ ఘటన(MMTS Train Incident)లో బాధితురాలిని బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్లో పరామర్శించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యంపై బండి సంజయ్ ఆరా తీశారు. అయితే మెరుగైన చికిత్స కోసం యశోదకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆదేశాలతో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి(Shilpa Reddy) గాంధీకి చేరుకొని, బాధితురాలిని యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పేరుతో గంటలు గంటలు వెయిట్ చేయించారని, ఇలా అయితే బాధితురాలికి అత్యవసర వైద్యం ఆలస్యం అవుతుందని గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై ఆమె మండపడ్డారు.
కాగా ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్(Secundrabad-Medchal) కు ఎంఎంటీఎస్ రైల్లో వెళుతున్న యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నానికి(Rape Attempt Incident) ఒడిగట్టాడు. తనని తాను రక్షించుకునేందుకు సదరు యువతి కదులుతున్న రైల్లోంచి బయటికి దూకగా తీవ్ర గాయాల పాలైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.