CM రేవంత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?

బంజారాలు(Banjara), లంబాడా(Lambada)ల మాతృభాష ‘గోర్‌బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ఆమోదింపజేసినందుకు పలువురు ఎమ్మెల్యేలు

Update: 2025-03-27 14:09 GMT
CM రేవంత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బంజారాలు(Banjara), లంబాడా(Lambada)ల మాతృభాష ‘గోర్‌బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ఆమోదింపజేసినందుకు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం గిరిజన ఎమ్మెల్యేలు బాలూ నాయక్, రాంచంద్రు నాయక్, రాందాస్ నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని శాసనసభ చాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. లంబాడా, బంజారాల చిరకాల ఆకాంక్ష అయిన ‘గోర్‌బోలి’ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.

డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియను కూడా ఖండిస్తూ శాసనసభ(Telangana Assembly)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ప్రజలకు కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. డీలిమిటేషన్‌ అనేది సౌత్‌కు లిమిటేషన్‌గా మారే ప్రమాదం ఉందని అన్నారు. 1971 నుంచి జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు. 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. డీలిమిటేషన్‌ వల్ల ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉందని ఆరోపించారు.

Tags:    

Similar News