TG News : అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతు సంఘాల నేతలు
సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) కొనసాగుతున్న వేళ.. అసెంబ్లీ బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) కొనసాగుతున్న వేళ.. అసెంబ్లీ బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు జగిత్యాల(Jagityala) జిల్లాకు చెందిన పసుపు రైతులు(Farmers), రైతు సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో చేసిన హామీ మేరకు రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రైతులు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కొద్దిసేపు రైతు సంఘాల నేతలకు, పోలీసులకు తోపులాట జరగగా.. అసెంబ్లీ ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు తమ డిమాండ్లను అసెంబ్లీలో వినిపించేందుకు పట్టుబట్టడంతో.. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.