పోసాని అభిమానుల్లో టెన్షన్.. మరింత ఆలస్యం అవుతున్న విడుదల
సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పై కేసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై కేసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం సమయంలో టీడీపీ, జనసేన అధినేతలను నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. ఏపీకి తీసుకెళ్లారు. ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదవ్వగా.. మొదట నాలుగు కేసుల్లో బెయిల్ (Bail) వచ్చింది. తాజాగా శుక్రవారం సాయంత్రం ఆయనకు సీఐడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందం నెలకొంది.
అయితే కొద్ది రోజుల క్రితం కూడా పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికి.. పోసానిని విడుదల (release) చేయకుండా మరొక కేసులో వెంటనే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో.. పోసాని తో పాటు ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బెయిల్ మంజూరైన జామీన్లు (Bail bonds) అందించడంలో జాప్యం జరుగుతుండటంతో పోసాని విడుదల మరింత ఆలస్యం అవుతుంది. కాగా ప్రస్తుతం పరిస్థితుల్లో.. పోసాని సా.5 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆయన అభిమానులు మాత్రం.. మరో కేసులో ఎమైన అరెస్ట్ చేస్తారని.. అందుకే కావాలని జామీన్లు అందించడంలో ఆలస్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ రోజు సాయంత్రం వరకు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల అవుతారా లేదా అనే విషయం తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.