GVMC: కక్షతోనే అవిశ్వాసం.. మాజీ మంత్రుల ఆగ్రహం

విశాఖ మేయర్ పీఠం పంచాయతీ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది...

Update: 2025-03-23 16:37 GMT
GVMC: కక్షతోనే అవిశ్వాసం.. మాజీ మంత్రుల ఆగ్రహం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మేయర్(Visakhapatnam Mayor) పీఠం పంచాయతీ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి(GVMC YCP Mayor Golagani Hari Venkata Kumari)పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. దీంతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana)తో పాటు విశాఖకు చెందిన మాజీ మంత్రులు రంగంలోకి దిగారు. వైసీపీ(Ycp) కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాగాజా వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 34 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఊటీకి వెళ్లేందుకు సిద్ధంకావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో క్యాంపు రాజకీయం తెరపైకి వచ్చింది.

అయితే కార్పొరేటర్లతో భేటీ అనంతరం బొత్స, కన్నబాబు, అమర్‌నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి నాయకులు సిగ్గుమాలని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కక్షతోనే మేయర్‌పై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి కుట్రలను ఢీకొడతామన్నారు. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బలం లేకపోయినా అవిశ్వాసం పెట్టమేంటని ప్రశ్నించారు.   

కాగా 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో జీవీఎంసీ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. గ్రేటర్ విశాఖలో 98 డివిజన్లు ఉండగా వైసీపీ 59 కైవసం చేసుకోగా మిగిలిన స్థానాల్లో కూటమి కార్పొరేటర్లు గెలిచారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత విశాఖలో సీన్ మారిపోయింది. మెజార్టీ ఎమ్మెల్యేలు కూటమి అభ్యర్థులే గెలిచారు. దీంతో జీవీఎంసీపై కూటమి నాయకులు దృష్టి పెట్టారు. పలువురు వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీల్లోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ బలం ప్రస్తుతం 34కు దిగిపోయింది. ఈ మేరకు మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టారు. దీంతో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Tags:    

Similar News