రాయలసీమలో వడగళ్ల వాన.. అధికారులకు కీలక ఆదేశాలు
వడగళ్ల వానతో రాయలసీమలో భారీగా జరిగిన నష్టంపై అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన విషయం తెలిసిందే. పలుచోట్ల ఎండ తీవ్రత(Sun intensity) పెరిగితే మరికొన్ని చోట్ల ఆకస్మాత్తుగా చల్లదనం(Coolness) ఉపశనం కలిగింది. అయితే రాయలసీమ జిల్లా(Rayalaseema District)లో మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం(Untimely Rain) ఉద్యానవన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. శనివారం వడగళ్ల వాన సైతం విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా 1364 మంది రైతులకు చెందిన 1670 హెక్టార్ల హార్టికల్చర్ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబో దిబో మంటున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యానవన శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వడగళ్ల వానతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. రాయలసీమ జిల్లాలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రాష్ర్టంలో ఎంత పంట నష్టం జరిగిందనే అంశాలపై అంచనాలు రెడీ చేయాలని సూచించారు. అలాగే రైతుకు పలు సూచనలు చేయాలని, అంతేకాకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.