అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయంటే..?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. సభ స్టార్టింగ్‌లోనే బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. సభ స్టార్టింగ్‌లోనే బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం లేదని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈసారి బడ్జెట్ సమావేశాలు ఏడు రోజులు కొనసాగనున్నాయి. ఈ నెల 15 వరకు సాగే అసెంబ్లీ రెండవ శనివారం కూడా కొనసాగనుంది. ఈ సమావేశాల్లోనే మరికొన్ని కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.