Instagram లో సీక్రెట్ రిలేషన్స్.. కొంతకాలం దాచక తప్పదు : అనన్య
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే 'గెహ్రాయియా' మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే 'గెహ్రాయియా' మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు హిలేరియస్ క్యాప్షన్స్, క్రాకింగ్ జోక్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గానూ మంచి పేరు సంపాదించింది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సంవత్సరాలుగా సోషల్ మీడియాతో తనకున్న సంబంధం ఏమైనా మారిందా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానమిస్తూ.. 'ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూట్ ఫీచర్ గురించి ఈ మధ్యే తెలుసుకున్నాను. నేను చూడాలనుకున్న, నేర్చుకోవాలనుకున్న విషయాలనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్స్‌ను ఎలా నేవిగేట్ చేయాలో తెలిసింది కాబట్టి సోషల్ మీడియాతో సంబంధం ప్రస్తుతానికి చాలా బాగుంది' అని తెలిపింది.
అంతేకాదు కొన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతాలను 'మ్యూట్ చేయడం' గురించి వివరిస్తూ.. 'మన జీవితంలోని ఒక దశలో కొన్ని విషయాలు నెగెటివ్‌గా ప్రభావితం చేయొచ్చు లేదా బంధాలను ప్రతికూలంగా మార్చవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని ఖాతాలను బ్లాక్ లేదా అన్‌ఫాలో చేయడం కంటే.. అలాంటి ఖాతాలను తిరిగి జీవితంలోకి అనుమతించేందుకు సిద్ధపడే నిర్దిష్ట కాలం వరకు మ్యూట్ ఆప్షన్ ఎంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది.