ఆయన గురించి మాట్లాడితే సిగ్గేస్తుంది.. పూనమ్ కౌర్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్‌హీరో పవన్ కళ్యాణ్‌కు నటి పూనమ్ కౌర్‌కు మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా latest telugu news..

Update: 2022-03-12 12:03 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్‌హీరో పవన్ కళ్యాణ్‌కు నటి పూనమ్ కౌర్‌కు మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్‌తో రిలేషన్‌షిప్ గురించి మరోసారి సంచలన కామెంట్స్ చేసింది పూనమ్. ఇటీవల ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో పలు విషయాలపై మాట్లాడిన నటి.. పవన్ గురించి ప్రశ్నలు అడగగానే 'అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది. దేవుడా..' అంటూ మొహం దాచుకుంది.

అలాగే ఈ మధ్య కాలంలో ఆయన గురించి ఏమి చెప్పినా వివాదమే అవుతుందన్న పూనమ్.. పాజిటివ్‌గా చెప్పినా నెగిటివ్‌గానే అర్ధం చేసుకుంటారని తెలిపింది. కానీ, పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అని ఊరిస్తూనే.. దేవుడా అంటూ మరోసారి చెప్పకుండానే నవ్వేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. పవన్ ఫ్యాన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

Tags:    

Similar News