భక్తులు vs వ్యాపారస్తులు.. శ్రీశైలంలో భారీ ఘర్షణ.. జోక్యం చేసుకున్న కర్ణాటక సీఎం

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలంలో భక్తులు, వ్యాపారస్తులకు మధ్య భారీ ఘర్షణ.. Latest Telugu News..

Update: 2022-03-31 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలంలో భక్తులు, వ్యాపారస్తులకు మధ్య భారీ ఘర్షణ జరిగింది. కర్ణాటక భక్తులకు, ఆంధ్ర వ్యాపారస్తులు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ఈ ప్రమాదంలో పలు షాపులు ధ్వంసం కాగా, రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. అందిన సమాచారం ప్రకారం.. అర్థరాత్రి సమయంలో కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు మంచినీళ్ళ బాటిల్ కొనేందుకు ఓ టీ దుకాణం దగ్గరకు వెళ్లాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అది గమనించిన మరికొందరు భక్తులు అక్కడకు చేరుకొని టీ షాపు ఓనర్‌తో వాదనకు దిగారు. ఇంతలోనే భక్తుల్లో ఒకరు టీ షాపుకు నిప్పంటించి ధ్వంసం చేశారు. దాంతో ఆగ్రహించిన వ్యాపారస్తుడు తిరగబడ్డాడు. ఈ గొడవలో ఇతర వ్యాపారస్తులు పాలుపంచుకున్నారు. ఈ ఘర్షణలో భారీ ఆస్తి నష్టమైంది. పలు బైకులు, కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ఈ గొడవకు అసలు కారణంగా ఇంకా తేలలేదు. అది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కర్ణాటక భక్తులను రక్షించమంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్‌ను గురువారం కోరారు. 'ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనేకమంది యాత్రికులు శ్రీశైలంలో దాడికి లోనయ్యారు. ఒక ప్రదేశంలో జరిగే జాతర్లకు వచ్చే ఇతర రాష్ట్ర యాత్రికులకు రక్షణ కల్పించాలి' అని బొమ్మై అన్నారు.

Tags:    

Similar News