అందుబాటులోకి 42.5 మెగావాట్ల సోలార్విద్యుత్
రామగుండంలోని 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న సోలార్విద్యుత్42.5
దిశ, తెలంగాణ బ్యూరో : రామగుండంలోని 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న సోలార్విద్యుత్42.5 మెగావాట్లను వాణిజ్యపరమైన అవసరాలకే వినియోగిస్తున్నట్లు రీజినల్డైరెక్టర్నరేశ్ఆనంద్శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్ఫేజ్లో భాగంగా 42.5 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లుగా వెల్లడించారు. కాగా ఫస్ట్‌ఫేజ్‌లో 17.5 మెగావాట్లు, సెకండ్‌ఫేజ్‌లో 20 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 100 మెగావాట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు మొత్తంగా 80 మెగావాట్ల కరెంట్‌ను తేలియాడే సోలార్విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడంపై రామగుండం అధికారులను అభినందించారు. ఇదిలా ఉండగా 100 మెగావాట్ల ఫ్లోటింగ్సోలార్ప్రాజెక్ట్దాదాపు 450 ఎకరాల మేర నీటిపై వ్యాపించి ఉందన్నారు. దీనికోసం రూ.423 కోట్లు వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు. సోలార్ ప్లేట్లను 40 బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్‌నుంచి 2.5 మెగావాట్ల సోలార్విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.