Dulquer Salmaan : "లక్కీ భాస్కర్" సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్

తాజాగా, లక్కీ భాస్కర్ (Lucky Baskhar) సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేశాడు

Update: 2024-11-05 02:19 GMT
Dulquer Salmaan :  "లక్కీ భాస్కర్" సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెలుగులో మహానటి, సీతారామం మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా, లక్కీ భాస్కర్ (Lucky Baskhar) సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేశాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకం పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దీపావళి రోజున విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మీడియాతో మాట్లాడారు. అసలు లక్కీ భాస్కర్ సినిమా ఎందుకు చేసాడో చెప్పాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. " మా డైరెక్టర్ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ మూవీ చేయాలనీ పిక్స్ అయ్యాను. బ్యాంకింగ్ నేపథ్యంలో కథలు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఎప్పటినుంచో ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకున్నాను. అది ఈ మూవీలో కనిపించడంతో ఇక ఓకే చెప్పేసాను, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి స్కాం ఎలా చేసాడనేది కొత్త పాయింట్. నటుడిగా అన్ని పాత్రలు చేయాలి. అప్పుడే మనలో ఉండే నటుడు బయట పడతాడు, ముఖ్యంగా, ఈ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఈ మూవీ నాకు సంతృప్తిని ఇచ్చిందని" తెలిపాడు.

Tags:    

Similar News