ధర్మం గెలిచే వరకు పోరాటం ఆగదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, హైదరాబాద్ ఆకారం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ ధర్మ పోరాటానికి చెన్నై (Chennai) శ్రీకారం చుట్టిందని, హైదరాబాద్ (Hyderabad) ఆకారం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. కేంద్రం తీసుకొని వస్తానంటున్న డీ లిమిటేషన్ (De Limitation) కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamilnadu CM Stalin) అఖిల పక్ష సమావేశం (All Party Meeting) ఏర్పాటు చేశారు. దీనికి మద్దతు తెలుపుతూ.. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) హాజరయ్యారు. ఈ సమావేశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుణ్యభూమి తూర్పు నుండి పడమర వరకు, ఈ ధన్యభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్నదని అన్నారు.
అంబేద్కర్ (Dr. Br Ambedkar) మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందిందని తెలిపారు. అలాగే ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి, విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేమని హెచ్చరించారు. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం అని సీఎం స్పష్టం చేశారు. అంతేగాక అది డీ లిమిటేషన్ ఐనా.. విద్యా వ్యవస్థపై (Education System) పెత్తనమైనా.. అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుందని చెబుతూ.. న్యాయం జరిగే వరకు ధర్మం గెలిచే వరకు పోరాటం ఆగదని రేవంత్ రాసుకొచ్చారు.