Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLA's) వినూత్న నిరసన(Strike) తెలిపారు.

Update: 2025-03-24 13:04 GMT
Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLA's) పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు తదితరులు వినూత్న నిరసన(protest) తెలిపారు. అకాల వడగళ్ల వానల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) అసెంబ్లీలో వ్యక్తిగత దాడులు, అనవసర విషయాలతో సమయం వృథా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మాత్రమే రైతుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు భారీ హామీలు ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా పథకం వరకు కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని, వారి హామీలన్నీ నీటి మీద రాసిన రాతలుగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, రైతులకు వెంటనే పరిహారం అందించాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో బీజేపీ ఎమ్మెల్యేలు మొక్కజొన్న కంకులు, మామిడి పిందెలు చేతపట్టి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, దెబ్బతిన్న పంటకు ఎకరాకు రూ.30,000 పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News