బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) పై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana Foermer CM KCR) పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సహా గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కే కిషోర్ గౌడ్ తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjara Hills Police Station) లో ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (BRS MLC Dasoju Sravan) మాట్లాడుతూ.. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కార్పోరేటర్‌వా..? కేంద్ర మంత్రివా..? అని ఫైర్ అయ్యారు. అలాగే బండి సంజయ్ సిగ్గు లజ్జ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత బండి సంజయ్ పై చెన్నూరు పోలీస్ స్టేషన్ (Chennuru Police Station) లో కూడ ఫిర్యాదు నమోదు అయ్యింది.
మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత, అబద్ధ ఆరోపణలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెన్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు బీదర్ లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది అని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారని ఆరోపించారు. దీంతో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
