మీ స్కామ్‌లు కూడా బయటికి వస్తాయి.. హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్

నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి మీడియాతో మాట్లాడారు.

Update: 2024-06-17 14:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే గాంధీ‌భవన్‌లో ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుల పాలనలో ఎప్పుడు విద్యార్థి, నిరుద్యోగులకు అందుబాటులో లేరని ఫైర్ అయ్యారు. గత పాలనలో ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో 55 రద్దు చేశామని,11,000 డీఎస్సీ పోస్టులు ఇచ్చామని గుర్తుచేశారు.

పదేళ్లలో మీరు సృష్టించిన సమస్యలు పరిష్కారం చేస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. మీకు మీ బామ్మర్ది కి జరుగుతున్న గొడవలు బయటకు రాకుండా ఉండడం కోసం ఇవన్నీ సృష్టిస్తున్నారని విమర్శించారు. పదేళ్ల మీ పాలన.. ఆరు నెలల మా పాలన పై బహిరంగ చర్చకు మేము రెడీ.. అని సవాల్ చేశారు. హరీష్ రావు పేషీలో పని చేసిన ఒక వ్యక్తి స్కాం లో అరెస్ట్ అయ్యారని, సీఎంఆర్ఎఫ్‌లో జరిగిన అవినీతినీ కూడా బయటకు తీస్తామన్నారు.

హరీష్ రావు మీరు చేసిన స్కామ్‌లు కూడా బయటికి వస్తాయని, ఇప్పటికే ప్రజా ప్రభుత్వంలో జూన్ 15వ తేదీ వరకు 75 వేల చెక్ లు రెడీ అయ్యాయన్నారు. 15 వేల చెక్‌లు లబ్ధిదారులకు అందచేయడం జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్ హామీ నీ నెరవేర్చుతామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేపర్ లీకేజి నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ఇక్కడ పేపర్ లీకేజి చూసి అక్కడ పెద్దలు నీట్ పేపర్ లీకేజి చేశారన్నారు. హరీష్ రావు తప్పుడు స్టేట్ మెంట్ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని, సమస్యలు ఉంటే తనకు చెప్పాలన్నారు. సీఎం దగ్గరికి తాను తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News