Sridhar Babu : నాలుగు నెలల్లో ఏఐ సిటీ సిద్ధం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ(Telangana)లో రానున్న రోజుల్లో ఏఐ(AI) రంగం భారీ పురోభివృద్ది సాధిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో రానున్న రోజుల్లో ఏఐ(AI) రంగం భారీ పురోభివృద్ది సాధిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. నేడు గ్లోబల్ లాజిక్ సాఫ్ట్ వేర్ ఆఫీసును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న నాలుగు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీ(AI City) నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తుందని వెల్లడించారు. అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్(Hyderabad) నగరం అనుకూలంగా ఉందని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి,యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12% గా ఉన్నాయని, వాటిని వచ్చే ఐదేళ్లలో 20% చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మలేషియా(Malaysia)లో స్థిరపడిన తెలుగు పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.