జనగామలో ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్టు...

రాత్రి సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని బెదిరించి ఇద్దరు వ్యక్తుల వద్ద డబ్బులు కాజేసిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ వాగు వద్ద చోటుచేసుకుంది.

Update: 2024-10-07 10:04 GMT

దిశ, జనగామ: రాత్రి సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని బెదిరించి ఇద్దరు వ్యక్తుల వద్ద డబ్బులు కాజేసిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ వాగు వద్ద చోటుచేసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ ఏసీపీ కొండం పార్థసారథి మాట్లాడుతూ.. దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బట్ట నితిన్ అనే వ్యక్తి తన స్నేహితుని చెల్లెలు ఫంక్షన్ కి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో… యశ్వంతపూర్ వాగువద్ద అదే గ్రామానికి చెందిన కాముని వినయ్, యామంకి మధు అనే వ్యక్తులు వారిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి రూ. 500 నగదు, రూ. 800 ఫోన్ పే ద్వారా వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.


Similar News